ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు మరో అవకాశం….

On: Thursday, April 30, 2026 11:46 AM

 

రాష్ట్రంలోని ప్లాట్ల యజమానులకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పెండింగ్‌లో ఉన్న లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) ఫీజుల చెల్లింపులపై ఏకంగా 25 శాతం భారీ రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఈ మేరకు జీవో నంబర్‌ 131ను విడుదల చేశారు.ఎల్‌ఆర్‌ఎస్‌ -2020 కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్లాట్‌ యజమానులకు ఈ వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం..2026 మే 1 నుంచి జులై 31వ తేదీ వరకు మూడు నెలల కాలంలో ఫీజు చెల్లించే వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. సాధారణ మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తూనే, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిషరించాలనే సంకల్పంతో సరార్‌ ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ అరుదైన అవకాశాన్ని ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకొని తమ ఆస్తులను క్రమబద్ధీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వేల సంఖ్యలో ఉన్న ప్లాట్ల యజమానులకు భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరనున్నది.

30 Apr 2026

Leave a Comment