A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి:
జక్రాన్ పల్లి మండలంలోని బాల్ నగర్ కి చెందిన శివరాత్రి లక్ష్మణ్,లక్ష్మీ ఈనెల 23న రాత్రి బైక్ పై వెళ్తు సికింద్రాపూర్ వద్ద వడ్ల కుప్పను ఢీకొని గాయపడ్డారు,వారిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు, చికిత్స పొందుతూ లక్ష్మీ(35) శనివారం మృతి చెందిందని ఎస్సై మహేష్ తెలిపారు,బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు,రోడ్డుపై ధాన్యం ఆరబోసి,గాయలైతే రైతులపై కేసులు నమోదు చేస్తామని,ఈ విషయాన్ని గమనించాలని ఎస్సై సూచించారు….








