ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకం….

On: Thursday, April 23, 2026 4:37 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆర్మూర్ డిపోలో తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమిస్తున్నట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య తెలిపారు.

డ్రైవర్ పోస్టుకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు కనీసం 18 నెలల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. అర్హత కలిగిన వారికి రోజుకు రూ.1000 వేతనం చెల్లిస్తామని తెలిపారు. కండక్టర్ పోస్టుకు పదో తరగతి (SSC) ఉత్తీర్ణత ఉండాలి. వీరికి రోజుకు రూ.800 చొప్పున వేతనం అందజేస్తామని వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఆర్మూర్ డిపోలో సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులు తమ ఎస్‌ఎస్‌సి మెమో ఒరిజినల్, ఆధార్ కార్డు ఒరిజినల్, పాన్ కార్డు మరియు రెండు ఫోటోలు వెంట తీసుకురావాలని డిపో మేనేజర్ తెలిపారు.

23 Apr 2026

Leave a Comment