ఈనెల 20 నుంచి ఓపెన్ టెన్త్,ఇంటర్, పరీక్షలు…..

On: Saturday, April 18, 2026 2:52 PM

 

హైదరాబాద్:ఏప్రిల్ 18

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ విద్యాపీఠం టాస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్,ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించను న్నట్లు టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి, తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లును ఏప్రిల్ 9 నుంచే అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు.

ఈ నెల 20 నుంచి నిర్వ హించే ఓపెన్ టెన్త్, ఇంటర్, పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12:00 గంటల వరకు, మధ్యాహ్నం 2: 30 నుంచి 5:30 వరకు రెండు సెషన్ల లో జరుగుతాయని అధికారులు తెలిపారు.

ఇంటర్మీడియట్‌ ప్రాటికల్‌ ఎగ్జామ్స్‌ ఏప్రిల్‌ 28 నుంచి మే 5 వరకు జరగనున్నట్లు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్‌) వెల్లడించింది.

20 Apr 2026

Leave a Comment