కామారం గ్రామంలో పోలీసుల బైక్ ర్యాలీ – హెల్మెట్ల పంపిణీ

On: Saturday, April 18, 2026 2:50 PM

 

చిన్నశంకరంపేట:

రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు శనివారం కామారం గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్, స్థానిక ఎస్సై నారాయణ గౌడ్ వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.

హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రాణాంతకమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

గ్రామంలో రహదారులు విశాలంగా ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ఉపయోగించడం ద్వారా తమ ప్రాణాలను కాపాడుకోవాలని అధికారులు తెలిపారు.      రిపోర్టర్ శ్రీకాంత్.

20 Apr 2026

Leave a Comment