ఆర్మూర్:
నందిపేట్ మండలం వన్నెల్ (కే )గ్రామంలో ఈరోజు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులు మరియు ఎల్ఓసీ లను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా అబ్బి గంగారాం కు రూ.5 లక్షల ఎల్ఓసీ అందజేశారు. అలాగే కల్యాణ లక్ష్మి పథకం కింద తేలు హన్మాండ్లు, పొట్టపల్లి గంగసాగర్ లకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వన్నెల్ కే గ్రామ బీజేపీ అధ్యక్షులు రాయికంటి భరత్ రెడ్డి, బద్దం నడిపి నాగన్న, బద్దం నారాయణ, వాకిడి జీవన్, గొల్ల దేగాం చిన్నయ్య, సలిగంటి సాయిలు తదితరులు పాల్గొన్నారు.








