ఆర్మూర్,ఆలూర్ మండలం:
దేగాం గ్రామంలోని బస్టాండ్ సమీపంలో కెనాల్‌పై ఉన్న కల్వర్ట్ కుంగిపోవడంతో ఎటుకాల్వ లో మురికి నీరు నిల్వ ఉండి, బస్టాండ్ పరిసర ప్రాంతం అపరిశుభ్రంగా మారింది. దీనివల్ల దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. అంతేకాకుండా వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో బస్టాండ్ మరియు సమీప ఇండ్లలోకి నీరు చేరి, ఆ ప్రాంతం చెరువును తలపించే పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇటీవల పంచాయతీరాజ్ డిఈ మరియు ఆర్ @బి,డిఈ గార్ల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అలాగే గ్రామ సభలో ఈ అంశంపై తీర్మానం చేసి ఎంపీడీఓ గారికి అందజేశారు. ఎంపీడీఓ ని సంప్రదించి ఆర్&బి, ఎస్ఈ కి లేఖ పంపించాలని కోరగా, వెంటనే స్పందించి సంబంధిత అధికారికి లేఖను పంపించారు.
దీంతో స్పందించిన ఆర్&బి, డిఈ, నేడు నూతన కల్వర్ట్ నిర్మాణానికి సంబంధించిన అంచనాలను (ఎస్టిమేట్) సిద్ధం చేసి ఈఈ,కి పంపించారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ ఆలూర్ గారికి, స్పెషల్ ఆఫీసర్ కి దేగాం గ్రామ సర్పంచ్ ఇట్టడి లింగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.






