హైదరాబాద్:ఏప్రిల్ 16:
ఉన్నట్లుండి కూరగాయల ధరలు అమాంతం పెరిగిపో వడంతో ఎలా కొనాలి? ఏమి తినాలి అనే ఆలోచనలో పడ్డారు. సామాన్యులు అకాల వర్షాల వల్ల పంటకు నష్టం జరగడం, వేసవి కాలం క్రమంలో ధరలు ఆమాం తం పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను పెంచేస్తున్నారు. దీంతో ఇప్పుడు కూరగాయల ధరలు రెండింతలు పెరిగాయి.
టమాటా ధరలు మళ్లీ పెరిగాయి. ఇటీవల కిలో రూ.10కి లభించగా.. ఇప్పుడు రూ.20కిపైగా పలుకుతున్నాయి.ప్రస్తుతం హైదరాబాద్‌లోని కూకట్ పల్లి రైతు బజార్‌లో కేజీ టమాటా రూ.23, వంకా య రూ.18, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.40, బజ్జిమిర్చి రూ.21, కాకరకాయ రూ.32, బీరకాయ రూ.35, క్యాబేజీ రూ.11, బీన్స్ రూ.60, క్యారెట్ రూ.23, గోబిపువ్వు రూ.25, దొండకాయ రూ.23, చిక్కుడుకాయ రూ.50, గోరుచిక్కుడు రూ.28కి లభిస్తోంది.
ఇక కేజీ బీట్ రూట్ రూ. 23, క్యాప్సికం రూ.33, ఆలుగడ్డ రూ.17, కీర రూ.18, దోసకాయ రూ.13, సొరకాయ రూ. 15,. పొట్లకాయ రూ.18, కంద రూ.30, ఉల్లిపొరక రూ.40, ఉల్లిగడ్డ రూ.18, చామగడ్డ రూ.28, చిలకడదుంప రూ.25, పచ్చిబఠాణి రూ.40, బొప్పాయి రూ.40, పుట్టగొడుగులు రూ.45, ఎండుమిర్చి రూ.260 పలుకుతున్నాయి.






