చిన్న శంకరంపేటలో ఎంపీ శ్రీ పాఠశాల క్రీడోత్సవం….

On: Thursday, April 16, 2026 10:25 AM

 

చిన్న శంకరంపేట, ఏప్రిల్ 15:

విద్యార్థులు తమ భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని ఆ దిశగా కృషి చేయాలని మెదక్ జిల్లా విద్యాధికారి విజయ సూచించారు. బుధవారం సాయంత్రం చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపీ శ్రీ పాఠశాల క్రీడోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఇంచార్జ్ మండల విద్యాధికారి దీప్లా రాథోడ్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి విజయ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వాలీబాల్ జట్టు కెప్టెన్ నరేందర్, వినయ్, అశ్వంత్, మోసిన్ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంతో వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంజలరా చంద్రశేఖర్, హలవత్ మోహన్, ఇమ్మడి నరేష్ తదితరులు మాట్లాడుతూ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ చదువులో శ్రద్ధ పెట్టాలని సూచించారు.

మండల విద్యాధికారి దీప్లా రాథోడ్, ఎస్టియు రాష్ట్ర కార్యదర్శి కర్రె పోచయ్య మాట్లాడుతూ ఈ పాఠశాల ఎంపీ శ్రీ పథకంలో ఎంపికైందని తెలిపారు. ఈ పథకం ద్వారా కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతులు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, అదనపు తరగతులు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

విద్యార్థులు తమకు అర్థం కాని విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని, చదువులో మెరుగైన ఫలితాలు సాధించాలంటే ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్: శ్రీకాంత్.

16 Apr 2026

Leave a Comment