
ఆర్మూర్ డివిజనల్ కార్యాలయంలో తెలంగాణ విద్యుత్ ఆర్టీసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె మూడో రోజుకు చేరుకుంది. బుధవారం నుండి ప్రారంభమైన ఈ సమ్మె, తమ సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యేంతవరకు కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు.
విద్యుత్ ఆర్టిసన్, అన్‌మ్యాన్డ్ మరియు పీస్ రేట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎన్‌పీడీసీఎల్ కంపెనీ కన్వీనర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆర్మూర్ డివిజన్ కార్యాలయం వద్ద సమ్మె కొనసాగింది. మూడో రోజు కార్యక్రమాన్ని కార్మికులు విజయవంతంగా నిర్వహించారు.
ఈ సమ్మెలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చైర్మన్ నూత్ పల్లి గంగాధర్, జిల్లా జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్, ఆర్మూర్ డివిజన్ చైర్మన్ గణేష్, కన్వీనర్ సుధీర్, రాజమోహన్ రెడ్డి, ఎర్రన్న, రమేష్, నరసయ్య, అశోక్, సత్యనారాయణ, మహేందర్, మూల శ్రీనివాస్, పోతుల సాయిలు, పీర్ భాష, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.








