వన్నెల్ (కే) గ్రామంలో…
ఆర్మూర్:
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వన్నెల్ (కే) గ్రామంలో ఈరోజు ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాలో ప్రత్యేక నమాజ్ నిర్వహించి, అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
మహమ్మద్ ప్రవక్త బోధించిన సిద్ధాంతాలను అనుసరిస్తూ 30 రోజుల ఉపవాస దీక్షను పూర్తిచేసుకున్న తర్వాత ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం ప్రత్యేకత. గ్రామంలోని ముస్లిం సోదరులు అందరూ కలిసి సోదరభావంతో శుభాకాంక్షలు పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామంలోని ముస్లిం మత పెద్దలు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








