A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి:
జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో శుక్రవారం రోజున రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి భూమి పూజ చేసిన రజక సంఘం సభ్యులు అనంతరం వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ లాంటి పోరాట యోధిని స్ఫూర్తిగా తీసుకోవాలని ముఖ్యంగా మహిళలకు తెలియజేశారు,ఈరోజు రజక సంఘానికి గర్వించదగిన రోజు అని చాకలి ఐలమ్మ చేసిన పోరాటం రజకులకు ప్రేరణను ఇచ్చిందని అన్నారు,అందుకే ఈ విగ్రహానికి భూమి పూజ రజక సంఘం ఆధ్వర్యంలో జరిగిందని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు,మరియు గ్రామ పెద్దలు,గ్రామ పంచాయతీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు…..








