A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన స్వగ్రామమైన అంకాపూర్‌లో ఘనంగా
వేడుకలు నిర్వహించారు. స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛాలు అందజేసి, పూలమాలలు వేసి, సాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, పేద ప్రజలకు మరింత సేవ చేయాలని, ప్రత్యేక అభివృద్ధి పథకాలతో ఆర్మూర్ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా, ఈ సందర్భంగా సామాజిక సేవకు ప్రతీకగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.








