కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన గుండా లలితకు ఘన సత్కారం…

On: Friday, March 20, 2026 8:25 PM

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆలూరు మండలం దేగం గ్రామానికి చెందిన గుండా లలిత కి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా గ్రామంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ లింగారెడ్డి అధ్యక్షత వహించి, గుండా లలిత కి శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు ఈ బాధ్యత దక్కడం గ్రామానికి గర్వకారణమని పేర్కొంటూ, ప్రజాసేవలో మరింత కృషి చేసి ప్రజల అభిమానం పొందాలని ఆకాంక్షించారు.

గుండా లలిత మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచిన పార్టీ నాయకులకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ అభివృద్ధి మరియు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొని గుండా లలిత కి అభినందనలు తెలియజేశారు.

20 Mar 2026

Leave a Comment