జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పాత్రికేయులు కడారి బాలేశం నియామకం….

On: Friday, March 20, 2026 5:07 PM

 

హైదరాబాద్: మార్చి 20

జర్నలిస్టుల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు కడారి బాలేశంని నియమించి నట్లుగా సంఘం జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి ప్రకటించారు.

గురువారం ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో జర్నలిస్టుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని అధి కారికంగా ప్రారంభించారు. 30 యేండ్లుగా జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో కొనసాగు తున్న కడారి బాలేశం సేవ లు జర్నలిస్టుల హక్కుల కోసం ఉపయోగపడతా యనే ఉద్దేశ్యంతో బాలేశం కు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష బాధ్యతలను అప్పగిచ్చినట్లు జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

సీనియర్ జర్నలిస్టు కడారి బాలేశం జర్నలిస్టుల సంక్షేమ సంఘంలోకి రావడం ఆనందించాల్సిన పరిణామమని, జర్నలిజం లో ఆయనకు ఉన్న అను భవం సంఘ బలోపేతానికి ఉపయోగపడుతుందన్నారు.అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్‌లో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం బాలేశం వంటి సీనియర్ల సేవలు వినియోగించుకుని బలమైన కార్యాచరణతో ముందుకు నడిచి తెలంగాణ జర్నలిస్టుల పక్షాన గట్టిగా కొట్లాడతామని మానసాని క కృష్ణారెడ్డి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

జర్నలిస్టు హక్కుల సాధన కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీనియర్ జర్నలిస్టులను తమతో కలిసి పనిచేయడా నికి రావాలని, వారిక సంఘంలో తగిన ప్రాతినిధ్య ఇస్తామని ఈ సందర్భంగా కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా తన మీద నమ్మకంతో నియమించినందుకు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చీకట్ల శ్రీనివాస్,జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి కి ఈ సందర్భంగా కడారి బాలేశం ధన్యవాదాలు తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని డివిజన్ల కమిటీలను త్వరలోనే పూర్తి చేసి భారీ సభను నిర్వహించి జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని కడారి బాలేశం తెలిపారు.రానున్న రోజుల్లో సంఘ బలోపేతా నికి శక్తివంచన లేకుండా కృషి చేసి రాష్ట్రంలోనే బలమైన గుర్తింపు జర్నలిస్టుల సంఘంగా ఏర్పడటానికి జాతీ య,రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కార్యక్రమాలను నిర్వహిస్తానని బాలేశం తెలిపారు.ఈ కార్యక్రమం లో జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చీకట్ల శ్రీనివాస్, జూబ్లిహిల్స్ డివిజన్ సంఘ బాధ్యులు శాసనాల సురేశ్,సీనియర్ పాత్రికే యులు ప్రకాశ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

*ఈనెలాఖరులో కరీంనగర్‌లో ఉత్తర తెలంగాణ సభ.

ఈనెలాఖరులో ఉత్తర తెలంగాణ జర్నలిస్టుల సభను కరీంనగర్ పట్టణంలో నిర్వహించ డానికి నిర్ణయించినట్లుగా జర్నలిస్టుల సంక్షేమ సంఘం బాధ్యులు తెలిపారు.ఈ సభ ద్వారా భారీ సంఖ్యలో జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో సభ్యత్వాల నమోదు చేయడానికి ప్రణాళికను రూపొందించినట్లుగా వారు తెలిపారు.

ఇప్పటికే జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో సీనియర్ పాత్రికేయులు, వివిధ జర్నలిస్టుల సంఘాల నాయకులు భారీ సంఖ్యలో చేరడానిక ఆసక్తిచూపుతున్నారని వారు తెలిపారు.రానున్న రోజుల్లో అత్యధిక సభ్యత్వం కల సంఘంగా ఏర్పడటం ఖాయమని సంఘ బాధ్యులు ధీమా వ్యక్తం చేశారు.

20 Mar 2026

Leave a Comment