Mar 20, 2026:
తెలంగాణ : రానున్న 2 గంటల్లో రాష్ట్రంలోని జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 41-61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. కాగా గురువారం రాత్రి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది.








