కరీంనగర్ జిల్లా :మార్చి 18
జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఏసీబీ సోదాలు ఘటన తీవ్ర చర్చనీయాం శంగా మారింది, కాగా అవినీతి కేసులో కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ రామును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సోదాల సందర్భంగా భారీ మొత్తంలో నగదు, బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కరీంనగర్ ఎక్సైజ్ సీఐ గుండెటి రాముతో పాటు అతడికి సహకరించిన జగిత్యాల జిల్లా ఉపాధ్యాయుడు జక్కని వేణును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రాము వేములవాడ ఎస్‌హెచ్‌ఓగా పనిచేసిన సమయంలో ఒక బెల్లం వ్యాపారి నుంచి పెద్ద మొత్తంలో మామూళ్లు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ అక్రమ సొమ్మును నేరుగా తీసుకోకుండా, ఉపాధ్యాయుడు వేణు బ్యాంకు ఖాతాల ద్వారా తన కుటుంబ సభ్యులకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. రాము నివాసంలో జరిపిన సోదాల్లో రూ. 20 లక్షల నగదును బంగారం స్వాధీనం చేసుకున్న ఏసీబీ, అధికారులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని ఈరోజు కోర్టులో హాజరు పరిచారు.








