ఆలూరు మండలం మిర్ధపల్లి గ్రామంలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు గ్రామానికి చెందిన ఏనుగు నడిపి సాయిరెడ్డి పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకుని క్రమశిక్షణతో చదివి వాటిని సాధించాలని సూచించారు. భవిష్యత్తులో మంచి స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలకు ఎలాంటి అవసరాలు వచ్చినా తమను సంప్రదించాలని తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు నరేందర్‌రావు మాట్లాడుతూ విద్యార్థులకు ఎల్లవేళలా దిశానిర్దేశం చేస్తూ సహకారం అందిస్తున్న సాయిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.








