రేషన్ బియ్యం పంపిణీ గడువు పొడిగింపు.. మార్చి 17 వరకు అవకాశం….

On: Monday, March 16, 2026 6:21 AM

 

Mar 15, 2026:

తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీ గడువును ప్రభుత్వం పొడిగించింది. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాల వల్ల మార్చి 15 వరకు బియ్యం తీసుకోలేని లబ్ధిదారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డుదారులు ఇప్పుడు మార్చి 17వ తేదీ వరకు తమకు దగ్గర్లో ఉన్న రేషన్ డీలర్ల వద్ద బియ్యం తీసుకోవచ్చు. పౌరసరఫరాల శాఖ ఈ వెసులుబాటును వినియోగించుకోవాలని సూచించింది. వచ్చే నెల ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది.

16 Mar 2026

Leave a Comment