దేశంలో గ్యాస్, చమురు రంగాల్లో సంక్షోభాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వినియోగదారులు ఒకే గ్యాస్ కనెక్షన్ను మాత్రమే కలిగి ఉండాలని, రెండో కనెక్షన్ ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG)తో పాటు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కనెక్షన్ ఉన్నవారు LPG కనెక్షన్ను సంబంధిత ఏజెన్సీలకు తిరిగి ఇచ్చేయాలని తెలిపింది. ఒక గృహానికి ఒకే ఇంధన కనెక్షన్ అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.







