గ్యాస్ సిలిండర్ల కొరతతో భారీగా ఇండక్షన్ స్టవ్ ల కొనుగోలు దీంతో ఇండక్షన్ స్టవ్ ల కొనుగోలు భారీగా పెరిగినట్లు ఈ-కామర్స్ సంస్థలు వెల్లడించాయి. సాధారణంగా నెలకు సుమారు 1.80 లక్షల ఇండక్షన్ స్టవ్స్ మాత్రమే అమ్ముడవుతుండగా, తాజాగా ఒకే రోజు 1.34 లక్షలకు పైగా ఇండక్షన్ స్టవ్స్ విక్రయమయ్యాయి. ఈ అనూహ్య డిమాండ్ మార్కెట్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది పెరుగుతున్న గ్యాస్ కొరత తీవ్రతను స్పష్టం చేస్తుంది.
ఫలితంగా కొంతమంది వ్యాపారులు ఇండక్షన్ స్టవ్స్ “Out of Stock” బోర్డులు పెడుతున్నారు. మార్కెట్ నిపుణుల ప్రకారం గ్యాస్ సరఫరా సమస్యలు కొనసాగితే ఇండక్షన్ స్టవ్స్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇండక్షన్ స్టవ్స్ వినియోగం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తక్కువ సమయంలో వంట పూర్తవడం, వంట చేసే సమయంలో భద్రత వంటి అనేక సౌలభ్యాలు ఇండక్షన్ స్టవ్స్ తో దొరుకుతాయి.







