Mar 15, 2026,
తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 22వ తేదీ రైతు భరోసా మొదటి విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ చేతుల మీదుగా నిధుల విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.







