Mar 15, 2026,
తెలంగాణ : అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా వచ్చే ఏప్రిల్ నుంచి 3–6 ఏళ్ల పిల్లలకు ప్రతిరోజు 100 మిల్లీ లీటర్ల పాలు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 35,781 అంగన్‌వాడీ కేంద్రాల్లో సుమారు 4.5 లక్షల మంది చిన్నారులు నమోదై ఉన్నారు. వీరికి పాలు అందించాలంటే రోజుకు 45 వేల లీటర్లకు పైగా అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకాన్ని ముందుగా ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. అక్కడ మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.







