ఆర్మూర్‌లో కోర్టు స్టే ఉన్నా సెల్లార్ నిర్మాణం – మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు…
A9 న్యూస్ ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కోటి రూపాయల బిల్డింగ్ సమీపంలో కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ సెల్లార్ నిర్మాణం కొనసాగుతున్నట్లు స్థానికులు బోల్లి రమేష్, గడ్డం కిషన్ లు ఆరోపించారు. తమ స్వగృహం పక్కనే కత్రాజీ రాజేందర్ అనే వ్యక్తి రెండు నెలల క్రితం గృహ నిర్మాణంతో పాటు సెల్లార్ నిర్మాణం చేపట్టారని తెలిపారు. అయితే ఈ సెల్లార్ నిర్మాణం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించబడిందని వారు పేర్కొన్నారు. ఈ విషయమై కోర్టును ఆశ్రయించగా కోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చినప్పటికీ, ఆ ఆదేశాలను పట్టించుకోకుండా మళ్లీ సెల్లార్ పునర్ నిర్మాణం చేపట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ జరుగుతున్న ఈ నిర్మాణంపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. గతంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన శైలజ ఆదేశాల మేరకు అప్పట్లో ఈ సెల్లార్ నిర్మాణాన్ని నిలిపివేసినట్టు వారు తెలిపారు. అయితే ప్రస్తుతం మళ్లీ అదే నిర్మాణాన్ని పునఃప్రారంభించడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ అనుమతి లేకుండా నిర్మించిన సెల్లార్‌ను మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు.







