మాజీ డిప్యూటీ స్పీకర్ యం . పద్మదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు వార్డ్ సభ్యులు బోడా. శ్రీకాంత్ జన్మదిన వేడుకలు….

On: Tuesday, March 10, 2026 8:41 PM

ఎ9 న్యూస్ ,మెదక్, మార్చ్ 10:

మాజీ డిప్యూటీ స్పీకర్ ,మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం . పద్మదేవేందర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో రామాయంపేట మండలం అక్కన్నపేట బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు,9వ వార్డ్ సభ్యులు బోడా శ్రీకాంత్ (బబ్లూ) జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.హైదరాబాద్ లోని కొంపల్లిలో పద్మదేవేందర్ రెడ్డి గారిని వారి నివాసంలో బోడా. శ్రీకాంత్ (బబ్లూ) బిఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పద్మాదేవేందర్ రెడ్డి గారు బోడా శ్రీకాంత్ తో కేక్ కట్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సన్మానించారు.అనంతరం శ్రీకాంత్ పద్మ దేవేందర్ రెడ్డి దంపతులను శాలువాతో సన్మానించి ముఖ చిత్రం ఫోటోను అందజేశారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట బిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు ఉమా మహేశ్వర్, మాడుర్ మాజీ ఎంపీటీసీ స్వామి నాయకులు శ్రీకాంత్ సాగర్, వెల్ముల మహేష్, శ్రవణ్ గౌడ్, కొక్కు స్వామి, తదితరులు పాల్గొన్నారు.

10 Mar 2026

Leave a Comment