ఘనంగా అన్నపూర్ణ ఆర్మూర్ నిర్మల్ రీజియన్ మీట్….

On: Saturday, March 7, 2026 6:01 AM

A9 న్యూస్ ఆర్మూర్:

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో గురువారం రోజు రాత్రి లయన్ డాక్టర్ ఎం.రాజన్న, రీజియన్ చైర్మన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320డి. అన్నపూర్ణ ఆర్మూర్ నిర్మల్ రీజియన్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సేవలు అద్భుతమని, అమోఘమని కొనియాడారు. ఉచిత విద్యా, వైద్యం సామాజిక సేవలు చేయడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ లయన్స్ క్లబ్బులైన ఆర్మూర్ నవనాథపురం, ఆర్మూర్ గ్రీన్, నిర్మల్, నిర్మల్ వారియర్స్, బాల్కొండ, బాల్కొండ ఫోర్ట్, భీమ్గల్, కమ్మపల్లి తదితర క్లబ్బుల సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్ పి. బసవేశ్వరరావు, పీడీజీలు పెంటయ్య, లయన్ ఈ. వీరేశం, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ మెంబర్, ఫస్ట్ వి.డి.జి విజయలక్ష్మి, సెకండ్ వి.డి.జి నరసింహారాజు పాల్గొన్నారు.

07 Mar 2026

Leave a Comment