వన్నెల్ (కే) జెడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలకు సైన్స్ ల్యాబ్ మంజూరు…

On: Thursday, March 5, 2026 7:28 AM

భూమి పూజ ఘనంగా….

ఆర్మూర్:

నందిపేట్ మండలం వన్నెల కే గ్రామంలోని జెడ్‌పిహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి ఏడబుల్యూపి నిధుల నుంచి రూ.13 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేయించడంలో ఎంపి ధర్మపురి అరవింద్ కీలక పాత్ర పోషించారు. స్థానిక శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి సహకారంతో ఈ నిధులు మంజూరయ్యాయి.

ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి చిన్నయ్య ఉప సర్పంచ్ మొహమ్మద్ ఖలీమ్,వార్డ్ సభ్యులు డొంకేశ్వర్ మౌనిక, సలిగంటి రజిత, తంబర్త సుశీల, షాదుల్ల గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, విద్యా కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భరత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ సైన్స్ ల్యాబ్ మంజూరు చేయించిన ఎంపీ, ఎమ్మెల్యే కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

గ్రామ విద్యా అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా స్థానికులు అభిప్రాయపడ్డారు.

05 Mar 2026

Leave a Comment