దేగం ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేత….

On: Wednesday, February 25, 2026 3:12 PM

 

ఆలూరు మండలం దేగం గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు ఆర్వో వాటర్ ప్లాంట్ అందజేసిన ఉజ్వల వ్యవస్థాపకులు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆలూరు ఎంఈఓ ఎం నరేందర్ హాజరై ఈ యొక్క వాటర్ ప్లాంట్ ను స్విచ్ వేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఉజ్వల ట్రస్ట్ వ్యవస్థ ద్వారా ఇలా ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను గమనించి ప్రభుత్వమే కాకుండా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం ఎంతో శుభ పరిణామమని ఇలా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ను అందజేసిన ఉజ్వల ట్రస్టు ని అభినందిస్తూ ఇలాంటి మరెన్నో సేవలు తమ యొక్క ట్రస్టు ద్వారా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల బాగుకోసం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉజ్వల వ్యవస్థాపక అధ్యక్షులు మిన్నీ శ్రీకాంత్ మాట్లాడుతూ తమ యొక్క సంస్థ ద్వారా ఇలాంటి మంచి పనులు చేయడం ఎంతో మనస్సు తృప్తి ఇచ్చిందని మున్ముందు ఎన్నో ఇలాంటి కార్యక్రమాలను దాతల సహకారంతో సేవలందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలూరు ఎంఈఓ ఎం నరేందర్ ఉజ్వల వ్యవస్థాపక అధ్యక్షులు మిన్ని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

25 Feb 2026

Leave a Comment