మిర్ధపల్లి లో రక్తదాన శిబిరం….

On: Tuesday, February 24, 2026 6:58 PM

 

ఆలూరు మండలం,మిర్ధపల్లి గ్రామంలో ప్రాణదార బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ యల్లా సాయిరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.

రక్తదానం ప్రతి ఒక్క యువకుడు చేయాల్సిన మహత్తర సేవ అని, రక్తదానం చేయడం వల్ల దాత ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అమూల్యమైన సహాయం అందుతుందని తెలిపారు. యువత పెద్ద సంఖ్యలో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సర్పంచ్ యల్లా సాయిరెడ్డిని ప్రాణదార ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో పెంటోళ్ల ప్రవీణ్, ప్రతాప్, పాత్రికేయులు యేల్లుల శ్రీకాంత్, జంపాల దేగంమురళి, గ్రామ పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

24 Feb 2026

Leave a Comment