మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని చిన్న శంకరంపేట గ్రామంలో ఉన్న సోమేశ్వర ఆలయంలో బోనాల పండుగను గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంజర చంద్రశేఖర్, ఉప సర్పంచ్ హేమ భాను ప్రసాద్, అలాగే గ్రామ పెద్దలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పుల వాయిద్యాలతో, సాంప్రదాయ నృత్యాలతో ఆలయ ప్రాంగణం భక్తిరసంతో మార్మోగింది. గ్రామస్తుల ఐక్యతను ప్రతిబింబించేలా ఈ బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.







