25లక్షల వరకు ఆస్తి నష్టం…
ఎ9 న్యూస్, చేగుంట, మెదక్ ,ఫిబ్రవరి 17:
చేగుంట మండల కేంద్రంలోని ప్రమాదవశత్తు మంటలు చెలరేగి దగ్ధమైతున హీరారామ్ చౌదరికి చెందిన జేబీ ట్రేడర్ దుకాణం , చేగుంటలో ప్రమాదవశత్తు దుకాణంలో మంటలు చెలరేగడంతో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది చేగుంట, ప్రారంభించిన 24గంటలు కాక మందే కళ్లెదుటే దుకాణాం ప్రమాదవశత్తు కాలిపోయిన సంఘటన మండలకేంద్రమైన చేగుంటలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. చేగుంటలో నివాసం ఉంటున్న హీరారామ్ చౌదరికి చెందిన జేబీ ట్రేడర్ దుకాణంను ఆదివారం ప్రారంభించారు. బిల్డింగ్లోని స్టోర్ రూమ్లో వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో నిప్పు రవ్వలు ఎగసి పడి మంటలు చెలరేగి అంటుకున్నట్లు, అందులోని అయిల్ డబ్బాలు, కలర్ డబ్బాలు, వెల్డింగ్ మిషన్, పరిశ్రమలకు ఉపయోగపడే కేబుల్ డ్రమ్ములు, పెయింటింగ్ డబ్బాలు, హెల్మెంట్స్, షూ కాటన్ ు, సంబంధితో పాటు ఇతర సామాగ్రి కాలి పోయినట్లు యాజమని హీరారామ్ చౌదరి తెలిపారు. చూట్టు పక్కల వారు ఫైర్ ఇంజన్కు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినప్పట్టికి సుమారు 15 లక్షల విలువగల ఆస్తి నష్టం జరిగిందని వారు తెలిపారు.








