ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపుపై కొరిపల్లిలో కాంగ్రెస్ భారీ నిరసన….

On: Wednesday, January 28, 2026 3:51 PM

మెదక్ జిల్లా ,చిన్న శంకరంపేట మండలం,కొరిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారని వెల్లడించారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తోందని తీవ్రంగా మండిపడ్డారు.

05 Feb 2026

Leave a Comment