ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్ ,జనవరి 27:
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని స్టేషన్ మాసాయిపేట గ్రామపంచాయతీ జాతీయ రహదారి హైవే 44 ప్రక్కన రెండు సర్వీస్ రోడ్లో జిఎంఆర్ నిర్లక్ష్యం వలన ఇరుపక్కల బస్ స్టాప్ లో చెత్త చెదారంతో నిండిపోవడంతో పాములు క్రీములు దోమల బెడద శునకాలు ఎలుకలు విషపురుగులు అధిక సంఖ్యలో తిరుగుతున్నాయని స్థానిక స్టేషన్ మాసాయిపేట గ్రామపంచాయతీ సర్పంచ్ స్టేషన్ శ్రీను ఆవేదన వ్యక్తపరిచారు పది సంవత్సరాలు నుండి మా గ్రామంలో ఎలాంటి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న మా గ్రామంలో ఇరుపక్కల సర్వీస్ రోడ్లో ఎలాంటి పనులకు నోచుకోలేదని కేంద్రం నుంచి నిధులు వస్తున్నారని జిఎంఆర్ నిర్లక్ష్యం వలన మా గ్రామంలో ఎటువంటి పనులు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తపరిచారు అనంతరం జిఎంఆర్ పై అధికారులకు కలుస్తామని లెటర్ అంద చేస్తామని తెలిపారు తూప్రాన్ టోల్ ప్లాజా లో ఉన్న జిఎంఆర్ అధికారులు ఎలాంటి పనులు చేయడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా సర్వీస్ రోడ్లో బస్ స్టాప్ లలో ప్రయాణికులు పాద చారులు ఉండడానికి వీల్ లేకపోవడం వలన ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానిక ప్రజలు ఇబ్బందుల గురవుతున్నారు ఇప్పటికైనా జిఎంఆర్ నిధులతో స్వచ్ఛతనం పరిశుభ్రత అనే నినాదంతో అధికారులు గ్రహించి వెంటనే మాకు న్యాయం చేయాలని స్టేషన్ మాసాయిపేట గ్రామ సర్పంచ్ స్టేషన్ శ్రీను ఆగ్రం వ్యక్తపరిచారు.








