హైదరాబాద్:జనవరి 21
తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్, ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది, ఏళ్ల తరబడి వేతనాల చెల్లింపు ల్లో ఎదుర్కొంటున్న ఇబ్బం దులకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఏప్రిల్ నెల నుంచి నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాలోనే జీతాలు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఈ విప్లవాత్మక మార్పు ద్వారా మధ్యవర్తులు ప్రైవేటు ఏజెన్సీల దోపిడీకి అడ్డుకట్ట పడనుంది…
ప్రభుత్వం వద్ద ఉన్న గణాం కాల ప్రకారం.. రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య దాదాపు ఐదు లక్షల వరకు ఉంది. అయితే, వీరి జీతాల పంపిణీలో ఏజెన్సీలదే పై చేయిగా ఉంటూ వచ్చింది. ప్రభుత్వం నిధులను నేరుగా ఏజెన్సీల ఖాతాల్లో వేయడంతో వారు ఉద్యోగు లకు ఇచ్చే వేతనాల్లో భారీగా కోతలు విధిస్తున్న ట్లుగా తేలింది. లేని ఉద్యో గుల పేరిట జీతాలు తీసు కుంటున్నట్లు వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వం నుంచి పీఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రయోజ నాల కోసం నిధులు విడుద లైనప్పటికీ.. చాలా ఏజెన్సీలు వాటిని ఉద్యోగు ల ఖాతాల్లో జమ చేయకుం డా పక్కదారి పట్టిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీని వల్ల ప్రభుత్వ ఆదాయం దుర్వినియోగం అవుతుంద ని భావించిన అధికారులు.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతా ల్లోనే నేరుగా జమ చేసేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వినిమం స్కేల్ పొందుతున్న ఉద్యోగులందరికీ ఐఎఫ్ఎం ఎస్ పోర్టల్ లేదా ప్రత్యేక పోర్టల్ ద్వారానే చెల్లింపులు జరగనున్నాయి. దీంతో ప్రతినెలా వీరికి క్రమం తప్పకుండా జీతాలు అందే అవకాశం కలుగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ విధానంలో భాగంగా శాఖల వారిగా ప్రతి ఉద్యోగి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించి కంప్యూటరీకరిస్తోంది. పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలను ఒకే గొడుకు కిందికి తెలుస్తోంది.ఏప్రిల్ నుంచి నేరుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోనే జీతాలను ప్రభుత్వం జమ చేయనుంది.
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగు లకు ఐఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ విధానం లో జీతాలను సర్కారు చెల్లిస్తోంది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం ఇదే పద్ధతిలో మధ్య వర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శకంగా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది.
అయితే ప్రస్తుత ఐఎఫ్ ఎంఎస్‌లోనే ప్రత్యేక ఆప్షన్ ఇచ్చి వీరికి జీతాలు జమ చేయడమా.. లేదంటే వీరి కోసం ప్రత్యేక వెబ్‌పో ర్టల్ రెడీ చేయడమా? అనే దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.








