జూ లో కనువిందు చేయనున్న జీబ్రాలు.
హైదరాబాద్: జవహర్‌లాల్ నెహ్రూ జంతు ప్రదర్శనశాల (జూపార్కు) లోని ఎన్‌క్లోజర్‌లోకి గుజరాత్ నుంచి తీసుకువచ్చిన మూడు జీబ్రాలను వదిలారు. సోమవారం 62వ జూ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సి.సువర్ణ పాల్గొని సందర్శకులు తిలకించడానికి వీలుగా జీబ్రాలను ఎన్‌క్లోజర్‌లోకి వదిలారు. 35 ఏళ్లుగా జూపార్కులో జీబ్రాలు లేవు. ఈ లోటును పూడ్చడానికి అధికారులు జీబ్రాలను తీసుకువచ్చారు.
అందులో రెండు ఆడ, ఒకమగ జీబ్రా ఉన్నాయి. జంతు మార్పిడిలో భాగంగా వంతారా జూపార్కుకు 20 మూషిక జింకలను ఇచ్చి, అక్కడి జూపార్కు నుంచి జీబ్రాలను తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన సింభా క్యాంటీన్, ఎలుగుబంట్ల కోసం నిర్మించిన నైట్ హౌజ్‌లను డాక్టర్ సి.సువర్ణ ప్రారంభించారు..








