Oct 28, 2025,
ఏం చేయబోతున్నామో డిసెంబర్ 9వ చెప్తా: CM రేవంత్
తెలంగాణ : సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కార్మిక సంఘాల అసోసియేషన్ కోసం భవన్ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తామని, ఫ్యూచర్ సిటీలో సినీ ఫైటర్స్‌కు శిక్షణ స్థలం కేటాయిస్తామని తెలిపారు. నవంబర్ చివరి వారంలో సినీ కార్మికులతో మాట్లాడి, డిసెంబర్ 9న వారి కోసం చేపట్టనున్న కార్యక్రమాలను ప్రకటిస్తామని అన్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇతర పరిశ్రమలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సీఎం పేర్కొన్నారు.








