స్థానిక పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఉండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి పేకాటరాయులపై మెరుపు దాడులు….

On: Tuesday, October 21, 2025 9:45 AM

 

ఎ9 న్యూస్ ,చేగుంట, అక్టోబర్ 21:

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, విశ్వస నీయమైన సమాచారం ఆధారంగా మెదక్ జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేగుంట గ్రామం పరిధిలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై దాడి నిర్వహించారు.

ఈ దాడిలో మొత్తం 8 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.58,060/- నగదు మరియు 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను మరియు స్వాధీనం చేసిన వస్తువులను చేగుంట పోలీస్ స్టేషన్‌కు అప్పగించి, కేసు నమోదు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, మాట్లాడుతూ:

జూదం వంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అని తెలిపారు.

11 Nov 2025

Leave a Comment