మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం, ఆర్. చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయి ప్రసాద్, ఐదు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, బెడ్ రెస్ట్ లో ఉన్నాడు. అతని పరిస్థితిని గుర్తించిన ఫౌండేషన్ డి శివ గారు, జి. కృష్ణ గారు మరియు రామదాసు గారు మానవత్వం చాటుతూ ముందుకు వచ్చారు.
ఈ ముగ్గురు సహృదయులు కలిసి సాయి ప్రసాద్‌కు వీల్ చైర్‌ను అందజేసి, అతని జీవన యాత్రలో కొంత భరోసానిచ్చారు. వారి సహాయంతో సాయి ప్రసాద్‌కు స్వల్ప స్థాయిలోనైనా స్వచ్ఛందంగా కదలిక సాధ్యమవుతోంది. గ్రామస్థులు, బంధుమిత్రులు ఈ సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.








