ఎ9 న్యూస్ డెస్క్, హైదరాబాద్ :
మావోయిస్టు పొలిట్ బ్యూరో మెంబర్ తో పాటుగా 61 మంది అక్టోబర్ 15 న సాయుధ పోరాట విరమణ ప్రకటించిన తదుపరి నేడు మావోయిస్టు పార్టీ సీసీ మెంబర్ ఆశన్న నాయకత్వంలో (సుమారు 150 మంది) రాష్ట్ర కమిటీ మెంబర్లు డివిజన్ కమిటీ మెంబర్లు ఏరియా కమిటీ మెంబర్లు ఈరోజు చత్తీస్గడ్ ముఖ్యమంత్రి సమక్షంలో సాయుధ పోరాట విరమణ అమలు జరగబోతుంది. నిన్న కామ్రేడ్ ఆశన్న కామ్రేడ్ భాస్కర్, కామ్రేడ్ రాజు సలాం కామ్రేడ్ రణిత, కామ్రేడ్ సవిత హిందీ టీవీ ఛానల్ లతో క్లుప్తంగా కొన్ని విషయాలు మాట్లాడినారు. సుదీర్ఘకాలం నుండి తీవ్రమైన అణిచివేత మధ్యలో ప్రజా సంఘాలు నిర్మించడం గాని ప్రజా ఉద్యమం నిర్మించడం గాని ఎంత మాత్రము సాధ్యం గాని పరిస్థితిలలో , అనేకమంది నాయకులను సభ్యులను ఎన్కౌంటర్లో కోల్పోతూ ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా సాయుధ పోరాటాన్ని విరమిస్తూ కామ్రేడ్ అభయ్ ప్రకటనకు సంపూర్ణంగా మద్దతు చేస్తూ ప్రజల కోసం చట్టబద్ధ బహిరంగ కార్యకలాపాలు కొనసాగించడానికి సాయుధ పోరాట విరమణ చేస్తున్న విషయం స్పష్టంగాసూటిగా , ప్రకటించినారు. కామ్రేడ్ ఆశన్న మాట్లాడుతూ ప్రజలు ప్రజాస్వామ్యవాదులు శాంతి ని కోరుకునేవారు గత ఆరు నెలల నుండి శాంతి చర్చల కోసం చేసిన ప్రయత్నాలు తమ నుండి చేసిన ప్రయత్నాలు సఫలము కాని పరిస్థితుల్లో తాము సాయుధ పోరాట విరమణ ప్రకటించడం జరిగిందని చెప్తూ ప్రాథమికంగా చత్తీస్గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ ముందు పది ప్రతిపాదనలు తమ పెట్టిన విషయాన్ని చెప్పినాడు. ఇందులో 1) మూల్ వాసి బచావో మంచ్ పై నిషేధం ఎత్తివేయాలని, 2) సాయుధ పోరాట విరమణ ప్రకటించి వచ్చిన మావోయిస్టు పార్టీ సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ సాయుధబలగాలైన డి ఆర్ జి చేరమని, 3) వివిధ కేసులతో జైల్లో ఉన్న మావోయిస్టు పార్టీ మెంబర్లు ప్రజాసంఘాలు ప్రజల పై ఉన్న కేసులను రద్దుచేసి జైలు నుండి విడుదల చేయాలని చెప్పిన విషయాలను డిప్యూటీ ముఖ్యమంత్రి ఆమోదించినాడు. ఇతర విషయాలు ఏమిటి అనే విషయం స్పష్టము చేయలేదు.
ముఖ్యమైన కీలకమైన విషయం ఏమిటంటే తాము సరెండర్ కాలేదని , తాము సాయుధ విరమణ ప్రకటన చేస్తూ చట్టబద్ధ బహిరంగమైన ప్రజా జీవితంలో తమ ప్రజా కార్యకలాపాలు నిర్వహించడానికి స్పష్టం చేసినాడు.
మావోయిస్టు పార్టీలో రెండు గ్రూపులుగా విడిపోయిన విషయం విలేకరి ప్రస్తావనకు వాస్తవమేనంటూ చెబుతూ, ఇప్పటికీ సాయుధ పోరాటానికి కట్టుబడిన మావోయిస్టు నాయకులు సభ్యులు సైతం పాజిటివ్ గా అనుకూలంగా ఆలోచించాలని అర్థం చేసుకుంటారని తాము భావిస్తున్నట్టు తమ డాష్ అన్న ప్రకటించినాడు.
(నోట్: ఈ సందర్భంగా జరిగే చర్చలో సాయుధ పోరాట విరమణ సరైనది అవుతుందా? లేదా సాయిధ పోరాటాన్ని కొనసాగించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? సాయిధ పోరాటం ఏ విధంగా కొనసాగించాలో చర్చించడం మాత్రమే ఉంటే బాగుంటుంది ఇంకా చాలా విషయాలు సాయుధ పోరాట విరమణ ప్రకటించిన వారు , లేదా సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని భావించేవారు ప్రకటనలు పట్టి ఆలోచించవలసి ఉంటుంది. రెండు ప్రధాన సైదాంతిక రాజకీయ విషయాలను వదిలివేసి అల్ప విషయాలపై చర్చించడం ద్వారా కమ్యూనిజానికి మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం ఉంటుంది అని గుర్తించగలరు)
అక్టోబర్ 17 2025.
జంపన్న (డెమొక్రటిక్ సోషలిస్ట్).








