ఎ9 న్యూస్ ,మాసాయిపేట, మెదక్ ,డిసెంబర్ 11:
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని మాసాయిపేట పట్టణంలో 7వ వార్డు సభ్యురాలుగా ఏర్పుల స్వాతి పరమేష్ నామినేషన్ వేశాను. ఈ సందర్భంగా జాంబవంతుని వారసులం మన వార్డ్ సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎందరో మహా నాయకులు వచ్చారుగాని ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. అందుకని నేను మీ ఏర్పుల స్వాతి- పరమేష్ మీ సమస్యలు నా సమస్యలుగా భావించి ,గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచి తో నా రాజ్యాంగం ప్రకారం గ్రామ వార్డుకు ఎన్ని నిధులు వస్తాయి.అన్ని నిధులతో పనులు చేయిస్తాను. అని ర్యాలీలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి ప్రచారం చేయడంతో ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపించుకుంటామని అంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి వార్డులో చాలా మురికి కాలువలు, వీధి స్తంభాలు, వీధిలైట్లు, మంచినీరు ఎన్నో సమస్యలు ఉన్నాయి. అని ఓటర్లకు సూచనలు తెలుపుతూ సందేహాలు సలహాలు వార్డు ఓటర్లతో పంచుకుంటున్నారు అని ఏర్పుల స్వాతి పరమేష్ అన్నారు.








