దొంగతనానికి యత్నించిన వ్యక్తికి గ్రామస్తుల దేహశుద్ధి….

On: Thursday, August 28, 2025 11:19 AM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆలూరు మండలం మిర్ధపల్లి గ్రామానికి చెందిన ఏలేటి నరసవ్వ వ్యవసాయ పనులు చేస్తుండగా, అదే గ్రామంలో కూలీగా పనిచేస్తున్న జాదవ్ అనే వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. బంగారం, డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో మహిళ ప్రతిఘటించగా, జాదవ్ తన వద్ద ఉన్న కత్తితో దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించాడు.

గత కొన్ని రోజులుగా ఆయన కుటుంబానికి దూరంగా ఉంటూ మద్యం మత్తులో తిరిగే జాదవ్ ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. గాయపడిన మహిళ భర్తకు సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, నిందితుడిని పట్టుకుని గ్రామంలో బంధించారు.

పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే చేరుకొని దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు.

15 Feb 2026

Leave a Comment