గ్రామానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించండి
-అగ్గు క్రాంతి ప్రమాణం….
అలూరు, A9 న్యూస్
అలూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి అగ్గు క్రాంతి గ్రామ అభివృద్ధికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని గ్రామంలో అమలు చేసి, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రతి కుటుంబానికి ఆ పథకాలు చేరేలా ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
యువత చెడు మార్గాల్లో నడవకుండా ఉండేందుకు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తానని, గ్రామ యువత అభివృద్ధి దిశగా అడుగులు వేయేలా మార్గనిర్దేశం చేస్తానని తెలిపారు. అలూరు గ్రామాన్ని జిల్లాలో అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుతానని క్రాంతి గారు ప్రమాణం చేశారు.
“మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదాలు నా బలం. ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించండి. గ్రామానికి అవసరమైన ప్రతి నిధిని తెచ్చి, అలూరును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాను” అని గ్రామ ప్రజలను, యువతను కోరారు.








