A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 23వ వార్డు, ఆర్టీసీ కాలనీ ఎంజె హాస్పిటల్ రోడ్‌లో గల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వాగ్దేవి యూత్ అధ్యక్షుడు గంగుల లక్ష్మి సాయి ఆధ్వర్యంలో గణపతి హోమం గురువారం భక్తిశ్రద్ధలతో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ. రాజశేఖర్, ఈరవత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు హాజరై మాట్లాడుతూ –
“వరసిద్ధి వినాయకుడు కోరికలన్నీ తీర్చేవాడు. సిరిసంపదలు, సంతానం, వర్షాలు – అన్నిటికీ మూలసూత్రధారుడు. దేశ సైనికులు, రైతులు బాగుంటేనే సమాజం సుఖంగా ఉంటుంది. గణపతి నవరాత్రులు కులమత భేదాలకు అతీతంగా అందరినీ ఏకం చేస్తాయి” అని అన్నారు.
అతను ఇంకా, బాలగంగాధర్ తిలక్ చూపిన మార్గం, శివాజీ మహారాజ్ అడుగుజాడలు యువతకు ఆదర్శం అన్నారు. పండుగలు శాంతియుతంగా జరగాలని, గణేశ్ నిమజ్జనం ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
భక్తులకు అన్నదాన ప్రసాదాలు పంపిణీ చేయగా, విగ్రహ దాత గంగా ప్రకాష్ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా సన్మానించారు. వాగ్దేవి యూత్ సభ్యులు మేకల సురేష్, ప్రవీణ్ గౌడ్, గంగుల పద్మయ్య, రమేష్, జగదీష్, శ్రీధర్, జనార్ధన్, శ్రీకాంత్, సత్య, గంగన్న, ప్రసన్న, గంగా మోహన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.








