ఆర్మూర్‌లో డా.బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు….

On: Saturday, December 6, 2025 2:13 PM

 

ఆర్మూర్, A9 న్యూస్:

నేడు భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో వివిధ సంఘాలు ఘనంగా నివాళులర్పించాయి.

ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ రూపకర్తగా దేశానికి అపార సేవలు అందించిన డా.అంబేద్కర్ గారి జ్ఞాపకార్థం పుష్పాంజలి కార్యక్రమాలు నిర్వహించారు. అంటరానితనం, అసమానత్వం, వివక్షలపై జీవితాంతం పోరాడిన ఆయన తత్వం ప్రతి తరానికి మార్గదర్సకమని నాయకులు పేర్కొన్నారు.

మామిడిపల్లి 24వ వార్డు ఇంచార్జ్ మట్టెల శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంగాధర్, అశోక్, సాయన్న, సుదర్శన్ తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు.

18 Jan 2026

Leave a Comment