A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంల పరిధిలో గురువారం ఉదయం దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే — బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ (48), వ్యక్తి, తన TVS ఎక్సెల్ వాహనంపై ఆర్మూర్ వైపు వెళుతుండగా, పెర్కిట్ శివారులోని మీనాక్షి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారి (NH-44)పై వెనుక నుండి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సుధాకర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే గుర్తు తెలియని వాహనం డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు.
స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.








