A9 న్యూస్ రూరల్ ప్రతినిధి
ఆగస్ట్ ,29.2025:
గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా దేగాం నుండి మిర్ధపల్లి గ్రామానికి మధ్యలో వాగు ఉదృతంగా ప్రవహించింది. దీంతో రాకపోకలు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాగు ప్రవాహం తగ్గిపోవడంతో రహదారి మళ్లీ స్పష్టమైంది. ప్రయాణికులు ఇప్పుడు ఈ మార్గాన్ని సురక్షితంగా వినియోగించుకోవచ్చని గ్రామస్థులు తెలిపారు.








