ఖైరతాబాద్ వినాయకుని దీవెనలు పొందిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్……

On: Friday, September 5, 2025 3:32 PM

A9 న్యూస్, మెదక్ – సెప్టెంబర్ 5

తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఖైరతాబాద్ మహా గణేశుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాదు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఆయనతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రేపటితో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్‌కు ఒక సంవత్సరం పూర్తికానుండడంతో, ఆయన ఈ దివ్య సందర్భంలో గణపతిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

ఇక ఆయన సేవలకు గుర్తుగా, ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు మహేష్ గౌడ్‌కు గణపతి విగ్రహాన్ని బహూకరించి సత్కరించారు.

14 Feb 2026

Leave a Comment