డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చూపిన బహుజన ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా రూపొందించిన సైద్ధాంతిక “యశోబుద్ధ క్యాలెండర్–2026” ను మోర్తాడ్ మండల కేంద్రంలోని జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద ఘనంగా ఆవిష్కరించారు.
మండలంలోని పలు అంబేడ్కరైట్ సంఘాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, బహుజన లోకానికి ఈ కాలమానికను అందించిన ఆర్మూర్ టీచర్స్ బృందాన్ని యశోబుద్ధ ఫౌండేషన్–తెలంగాణ ప్రతినిధులు మనస్ఫూర్తిగా అభినందించారు.
ఈ కార్యక్రమంలోదళిత సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లూరి రాజారాం,ప్రధాన కార్యదర్శి జంభవ చమార్,కాన్షిరాం మాలజీ,ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం కన్వీనర్ తోట బావన్న మహారాజ్,మామిడి రాజారెడ్డి, కె. గంగాధర్,జర్నలిస్టులు బి. సాయన్న, సామ్రాట్ అశోక్, అంగుళి మాలజీ, మామిడి రాజు, కటికే రవీందర్, మూలనివాసి మాలజీ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
బహుజన ఆలోచనా ధోరణిని బలపరచేలా రూపొందించిన యశోబుద్ధ క్యాలెండర్ సమాజంలో చైతన్యాన్ని తీసుకువస్తుందని వక్తలు పేర్కొన్నారు.








