రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో గృహ జ్యోతి జీరో బిల్ పథకం అమలుతో లబ్ది దారుల సంతోషం….

On: Saturday, January 17, 2026 8:28 PM

 

A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి :

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలో భాగంగా గృహ జ్యోతి జీరో బిల్ పథకం మన తెలంగాణ రాష్ట్రంలో 52 లక్షల 82 వేల 498 కుటుంబలు లబ్దిపోందుతున్నాయి, గృహ జ్యోతి పథకం ప్రారంభం నుండి నేటి వరకు 3593 కోట్లు రూపాయలు ప్రభుత్వం విధ్యుత్ సంస్థలకు చెల్లించింది, జక్రాన్ పల్లి గ్రామంలో సుమారు 1100 13 కుటుంబాలు గృహజ్యోతి లబ్ధి పొందడం జరుగుతుంది, దీనికి లబ్ధిదారులు సంతోషంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డికి గా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి పద్మ సత్యం, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ కటిపల్లి నర్సారెడ్డి, సోప్పరి వినోద్,కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు సైకిల్ టెక్స్ అక్బర్, మరియు గ్రామ లైన్మెన్ బలరాంమ్ నాయక్, సత్యనారాయణ, మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

15 Feb 2026

Leave a Comment