మండలంలో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాగంగా పాఠశాలలు పరిశీలించిన ఎస్సై…..

On: Saturday, November 22, 2025 2:10 PM

 

*A9 న్యూస్ ప్రతినిధి :

జక్రాన్ పల్లి మండల కేంద్రంలోనీ వివిధ గ్రామాల్లో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్టా జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై జి,మహేష్ చింతలూరు గ్రామాన్ని సందర్శించారు.ముక్యంగా ఈ ఎన్నికలను స్వేచ్చాయుతంగ మరియు ప్రశాంతంగా నిర్వహించడం కోసమే ఈ పర్యటన చేపట్టినట్టు ఎస్సై మహేష్ తెలిపారు.ఈ పర్యటనలో పంచాయతీ కార్యదర్శి,గ్రామ పంచాయతీ సిబ్బంది,గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలతో సమావేశమై స్థానిక రాజకీయ పరిస్థితులు ఎన్నికల సమయంలో ఏర్పడే సమస్యల వంటి అంశాల పై వివరాలు సేకరించారు.తర్వాత గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా అంశాల పై వివరాలు సేకరించారు.

*ఈ సందర్భంగా ఎస్సై మహేష్ మాట్లాడుతూ….

ఎన్నికలు పూర్తిగా స్వేచ్చాయుతంగ మరియు ప్రశాంతంగా జరగాలి, ఎవరు ఓటర్లను ప్రభావితం చేయకూడదు డబ్బు,మద్యం, పంపిణీ బెదిరింపులు, గుంపులుగా తిరిగి ఉద్రిక్తత సృష్టించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తం అని హెచ్చరించారు, ఎవరైనా ఎన్నికల ఉల్లంఘనలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామ ప్రజలను కోరారు.

16 Dec 2025

Leave a Comment